Header Banner

మెల్బోర్న్‌లో ఘనంగా ఎన్టీఆర్ వజ్రోత్సవం, మినీ మహానాడు! ఎన్ఆర్ఐల కృషికి ...

  Mon Jun 09, 2025 13:50        Associations, Australia

ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో తెలుగు దేశం పార్టీ NRI విభాగం ఆధ్వర్యంలో NTR సినీ వజ్రోత్సవం మరియు మినీ మహానాడు 2025 కనీవినీ ఎరుగని రీతిలో జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా NTR లిటరేచర్ గ్లోబల్ నెట్వర్క్ చైర్మన్ శ్రీ TD జనార్ధన్ గారు, వైస్ చైర్మన్ అట్లూరి అశ్విన్ గారు, NTR కుమారుడు నందమూరి రామకృష్ణ గారు, TDP శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ గారు, బోడె ప్రసాద్ గారు, సినీ నటుడు నారా రోహిత్ గారు, జూమ్ కాల్ లో డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణంరాజు గారు పాల్గొని ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు.

WhatsApp Image 2025-06-09 at 1.20.57 PM.jpeg

 

ఈ సందర్భంగా జరిగిన సభలో TD జనార్ధన్ గారు మాట్లాడుతూ, NTR సినీ రాజకీయ జీవితాలను భావితరాలకు తెలియచేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. NTR సినీ ప్రస్థానాన్ని, ఆయన పోషించిన పాత్రల గొప్పతనాన్ని, రాజకీయాలలో ఆయన చేసిన ప్రజాస్వామ్యాన్ని కొనియాడారు. జనార్ధన్ గారి ప్రసంగానికి శ్రోతల నుండి అద్భుత స్పందన లభించింది.అట్లూరి అశ్విన్ NTR పట్ల తనకున్న వీరాభిమానాన్ని తెలియచేస్తూ, ఆయన రాసిన కొన్ని పాటలను, పద్యాలను వినిపించారు.

WhatsApp Image 2025-06-09 at 1.20.56 PM.jpeg

 

NTR కుమారుడు నందమూరి రామకృష్ణ, తన తండ్రి నీతి నిజాయితీ, క్రమశిక్షణ కు మారుపేరు అని గొప్ప మానవతావాది అని చెప్తూ, రాయలసీమ లో కరువు మరియు దివిసీమ ఉప్పెన సమయంలో ప్రజలను ఆదుకున్నారని, ఆయన కొడుకుగా పుట్టడం అదృష్టం గా భావిస్తున్నాను అన్నారు.సోమిరెడ్డి గారు తన ప్రసంగంలో జగన్ మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలలో అవినీతి, అరాచక పాలనను తీవ్రంగా ఖండించారు. అందుకే ఆ అవినీతి పాలనకు ప్రజలు గొడ్డలి వేటు వేసి ప్రజాపాలన తెచ్చుకున్నారు అని, మొన్న జరిగిన ఎన్నికలలో NRI TDP అభిమానులు చేసిన కృషిని అభినందించారు.పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మెల్బోర్న్ తనకు ఇష్టమైన నగరమని, తన కష్టకాలంలో అండగా నిలిచిన మరియు సంఘీభావం తెలిపిన వారందరికీ కృతఙ్ఞతలు తెలియచేశారు.

 

WhatsApp Image 2025-06-09 at 1.20.56 PM (1).jpeg

 

ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగువారు పెద్ద సంఖ్యలో తరలివచ్చి NTR పట్ల, తమ రాష్ట్రం పట్ల ఉన్న అభిమానాన్ని, మమకారాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి. నిర్వాహకులు వచ్చిన వారందరికీ రుచికరమైన విందును అందించారు.ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా, ఆహ్లాదకరంగా జరగడంపట్ల NRI TDP మెల్బోర్న్ ప్రెసిడెంట్ లగడపాటి సుబ్బారావు గారు, సెక్రటరీ ముప్పనేని రామ్ గారు, వైస్ ప్రెసిడెంట్ గోపి గారు, ప్రకాష్ మారుతి, బెల్లం పూర్ణ, సంతోష్మ, సుమన్, ఏడుకొండలు, మహిళా ప్రతినిధులు సుమ, నర్మద జొన్నలగడ్డ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

ఇది కూడా చదవండి:  ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఆ పుణ్యక్షేత్రానికి రెండు వందే భారత్ రైళ్లు! రూట్ అండ్ టైమింగ్స్ ఇవే!

 

 

ఆధార్ కార్డులో ఈ తప్పులు ఉంటే వాటికి అనర్హులు! వెంటనే సరి చేసుకోండి!

 

ఆ ఇద్దరు వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిన జగన్! పార్టీ నుండి సస్పెన్షన్ వేటు..

 

 కృష్ణంరాజు, కొమ్మినేని వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్.. కఠిన చర్యలు తప్పవు!

 

 చంద్రబాబు కీలక ప్రకటన! తల్లికి వందనం ముహూర్తం ఫిక్స్!

 

ఆ నీచులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు.. ఒక్కొక్కరికి ఊచకోతే! మహిళలపై అనుచిత వ్యాఖ్యలు!

 

మహిళలను కించపరిస్తే సహించం - క్షమాపణలు చెప్పాలి.! లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!

 

రైతులకు శుభవార్త! తక్కువ వడ్డీతో రూ.3 లక్షల లోన్!

 

ఏపీకి వస్తోన్న గూగుల్.. అక్కడ 143 ఎకరాల్లో ఏర్పాటు.. ఆ ప్రాంతానికి మహర్దశ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!

 

అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే?

 

ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

 

తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!

 

నేడు (9/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NTRVajrotsavam #NTRMahanadu2025 #TDP #NRITDP #TeluguDesamParty #MelbourneEvent #TeluguCommunity #NTRHonor #TDJanardhan #TeluguCulture #NTRSon #Somireddy #NaraRohith #TDPEvents #NRITelugu #MelbourneTelugu #TeluguFans #TeluguHeritage #NTRDemocracy #TDPNRIEvents